
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఏర్గట్ల మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యములో నూతన ప్రభుత్వ మండల శాఖ గ్రంథాలయంను గ్రామాభివృద్ధి కమిటీ క్రింద ప్రారంభోత్సవం చేసిన జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ అంతిరెడ్డి రాజారెడ్డి యువతి యువకులకు, నిరుద్యోగుల విజ్ఞానం పెంపొంది ప్రభుత్వ ఉద్యోగుల పరీక్షల కోసం అన్ని రకాలుగా బుక్స్, న్యూస్ పేపర్స్, ఫర్నీచర్లు,చైర్ లతోపాటు అన్ని వసతులు ప్రభుత్వ జిల్లా గ్రంథాలయం తరపున కల్పిస్తామని మండల, గ్రామ స్థాయి యూత్ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. ఇంటి వద్ద చదవటం వీలు కాకపోవటం, డైలీ పత్రికలు, బుక్స్ మెటీరియల్ లేని వారు వచ్చి చదువుకోవాలని అన్నారు. ఇక్కడ రూమ్ హాల్, ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఒక్క అటెండర్ యుంటారని ఉదయం,సాయత్రం సమయంను బట్టి తెరిచి యుంటాదని అన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో ఇది ఏర్పాటు చేశామని, దీనికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సహకరించినందుకు కృతజ్ఞతలు రాజారెడ్డి తెలిపారు. మా ఏర్గట్ల కు ప్రభుత్వ లైబ్రరీ మంజూరు ఇప్పించినందున గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చైర్మెన్ అంతిరెడ్డి రాజారెడ్డి ని శాలువతో ఘనముగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమములో వీడీసీ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
