
తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించిన ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ నవ్య
పాల్గొన్న అంగన్వాడీ టీచర్లు సుజాత , నిర్మల, హేమలత
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం లోని కడియాలకుంట తండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలకు పోషణ ఆహారం అందించాలని, పిల్లలపై పోషణ ఆహారం ప్రభావం పడకుండా చూడాలని తల్లిదండ్రులను సూచించారు. అంతేకాకుండా పసి పిల్లలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ప్రతి చిన్న పిల్లలకు తల్లిపాలే బలం అని దాని ద్వారా పిల్లల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుందని పిల్లల తల్లులకు వివరించారు. మరియు చిన్నపిల్లలకు గర్భవతి మహిళలకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించడం జరిగింది. పౌష్టికాహారం చిన్నపిల్లల తల్లులకు మరియు గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ నవ్య, అంగన్వాడీ టీచర్ సుజాత, హేమలత మరియు నిర్మల, పిల్లల తల్లులు గర్భవతులు మరియు బాలింతలు పాల్గొన్నారు.
