
పయనించే సూర్యుడు జూలై 8( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండల కేంద్రంలో మొహరం షహదత్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీర్లను ఊరేగింపుగా వీధులలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు షేక్ నజీర్,షేక్ మహమ్మద్ అలీ,షేక్ నజీర్ షేక్ రఫీ,సమీపంలో ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొహరం వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తాళాలు, తప్పెట్ల నాదంతో ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తుల ఉత్సాహంతో వేదిక ప్రాంగణం శోభాయమానంగా మారింది. శాంతియుతంగా ముగిసిన ఈ వేడుకలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు