
పయనించే సూర్యుడు,జనవరి 21,కాప్రా ప్రతినిధి సింగం రాజు:కరాటే లో నైపుణ్యాన్ని సాధించి ఆ విద్యను నలుగురికి నేర్పుతున్న హైదరాబాద్ పట్టణానికి చెందిన ఛాంపియన్ షోటోకన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు గ్రాండ్ మాస్టర్ బుడిగే రవికుమార్ గౌడ్ కు ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ పురస్కార్ అవార్డుప్రధానం చేశారు.జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో ఎంతో మంది కరాటే విద్యార్థులను ఛాంపియన్లుగా తయారు చేస్తూ,ఎన్నో బహుమతులు పొందటంలో విశేష పాత్ర పోషిస్తున్నాడు. కేజీ టుపీజీ గురుకుల విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తూపలుగురుకుల విద్యాసంస్థలలో కరాటే మాస్టర్లను తయారు చేస్తున్నాడు.అలాగే 100 పైగా విద్యార్థులకు కరాటే ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నారు. అలాగేతల్లిదండ్రులులేని విద్యార్థులకు కరాటే ఉచిత శిక్షణ ఇస్తున్నాడు.ఈ కార్యక్రమంలో 8 విదేశాల నుండివచ్చిన ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్లు కేశవ్ అకాడమీ వారు బిర్లా సైన్స్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా సన్మానించి అవార్డు అందజేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మినిస్టర్ కిషన్ రెడ్డి,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి,ఎనిమిది విదేశాల నుండివచ్చిన కరాటే గ్రాండ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.