
పయనించే సూర్యుడు మార్చి 6 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం ఐ. యన్.టి.యు.సి అధ్యక్షులు గా కర్క నాగరాజు నియామకం ఈరోజు మూసాపేట్ ప్రాంతానికి చెందిన హెచ్.ఏ.ల్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న కర్క నాగరాజు ను కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు గా నియమించినారు. నియామక పత్రాన్ని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కర్క నాగరాజు కి అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గం లో కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పి.జె.ఆర్ ను ఆదర్శనంగా తీసుకుని ముందుకు వెళ్తున్న యువ కార్మిక నాయకులు కర్కనాగరాజు కి పార్టీ తరపున, నా తరపున సహాయ సహకారాలు అందిస్తానని వారు పేర్కొన్నారు. కర్క నాగరాజు మాట్లాడుతూ నా పై నమ్మకం తో ఐ.యన్.టి.యు.సి కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు గా నియమించిన బండి రమేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.నియోజకవర్గం లో కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేస్తానని తెలిపారు.నియోజకవర్గం లో ఐ.యన్.టి.యు.సి ని బలోపేతం చేస్తూ అందరి సహకారం తో ప్రభుత్వ పథకాలను ప్రజలకు, కార్మికులకు అందె విదంగా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క పెంటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పరెడ్డి,వైస్ చైర్మన్ ప్రకాష్, మాదిరెడ్డి యుగేందర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి అనిల్ అరుణ్ కుమార్ అజాజ్ బాలరాజు హమీద్, అశోక్ మరియు హెచ్.ఏ.ల్ యూనియన్ నాయకులు సిబ్గ్గ తుల్లాహ్, శ్రీకాంత్ వెంకటపతి అబ్దుల్ షుకూర్ కృష్ణా నాగార్జున బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.