
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 4 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
హుజురాబాద్ నియోజకవర్గ వినవంక మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, ఇటీవల అనారోగ్యం కారణంగా, హనుమకొండ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో, మెరుగైన వైద్యం తీసుకొని, ఆరోగ్యం కుదుటపడినంక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి, హనుమకొండలోని తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కీ విషయం తెలియగానే కర్ర భగవాన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి, పరమర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తో పాటు నర్సింగారావు, రాజేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.