
గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు..
రుద్రూర్, ఏప్రిల్ 08 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్, రాయకూర్ క్యాంపు, సులేమాన్ నగర్ గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మహాత్మ గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్, జహిరాబాద్ పార్లమెంట్ దిశా మెంబర్ నడిపింటి నాగేష్, మండల నాయకులు నిస్సార్, ఇందూర్ కార్తిక్, సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.