
అవగాహన కల్పిస్తున్న దృశ్యం…
రుద్రూర్, జూలై 09 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండలంలోని పలు గ్రామాలల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నితిన్ పటేల్, ఉపాధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ శుక్రవారం రోజున బాన్సువాడలోని శ్రీనివాస గార్డెన్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నిసార్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.