జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2025లో తెలంగాణ కు పెట్టుబడులు భారీగా మొదలవడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ నిత్యావసర వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనివలివర్ గ్లోబల్ సంస్థతో కీలక ఒప్పందం కుదిరిందన్నారు. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఉత్పత్తి కేంద్రం, మరో చోట బాటిల్ క్యాప్ లను తయారు చేసే యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని సంసిద్ధత వ్యక్తం చేసి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమన్నారు. కామారెడ్డి జిల్లాలో రైతులు అధికంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్నారని ఆయిల్ ఫామ్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న నిర్ణయంతో పామాయిల్ రైతులకు గిట్టుబాట ధర లభిస్తుందని,స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రైతులు, యువత హర్ష్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి , రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ప్రత్యేక దృష్టి సాధించిందడానికి ఇదే నిదర్శనమన్నారు రైతుల అభివృధ్ధి, యువత సంక్షేమం కోసం అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి జిల్లా రైతాంగం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.