
పయనించే సూర్యుడు:జులై 06:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామంలో రామాలయం వీధిలో గత కొన్నేళ్లుగా తొర్రెం సాగర్ అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా శనివారం అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయం చూసుకొని గుర్తు తెలియని కొంతమంది దుండగులు కిరాణా ముందు భాగంలోని స్వెటర్ కి పెట్రోల్ పోసి నిప్పు అంటించారని తెలియజేశారు. ఈయొక్క ఘటన శనివారం అర్ధరాత్రి తెల్లవారితే ఆదివారం జరిగిందని స్థానికులు తెలియజేశారు. దుండగులు అంటించిన మంటలలో సుమారు రూ.90000 వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అన్నారు. వాటి వివరాలు ఒక ఫ్రిడ్జ్, 40 లీటర్లు పెట్రోలు, శీతల పానీయాలు,(డ్రింక్స్ బాటిల్స్) మరియు కిరాణా సామాగ్రి కాగా ముందు భాగం పూర్తిగాధ్వంసంఅయిపోయిందని తెలియజేశారు. దోషులు ఎవరైనాప్పటికీ వారిని పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని అలాగే జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు పత్రికాముఖంగా వేడుకున్నాడు.