
శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 29:- రిపోర్టర్ (కే శివకృష్ణ)
కుప్పం మున్సిపల్ చైర్మన్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన సెల్వరాజ్ కు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. సోమవారం ఢిల్లీ నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి తెలుగు దేశం పార్టీ సముచిత స్థానం కల్పించి, గౌరవిస్తుంది అనడానికి ఇదో నిదర్శనం అన్నారాయన.. బీసీ వర్గానికి చెందిన సెల్వరాజ్.., పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో.. కుప్పం పట్టణ అభివృద్ధికి కృషి చేసి.., ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , . ఆయన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా.. ప్రజలకు సేవలందించి, మున్సిపల్ చైర్మన్ పదవికి వన్నె సుకురావాలన్నారు.