పయనించే సూర్యుడు/జనవరి 10/కాప్రా ప్రతినిధి సింగం రాజు
ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్బంగాకుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని వెంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవలొ పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.తదనంతరం స్వామి వారి శాలువా.పూల మాలతో ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ చైర్మన్ సంకురి శ్రీనివాస్ గౌడ్ ఆలయ ఈఓ వేరేషం.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వర్ రెడ్డి పూజలు :
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుషాయిగూడ లోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి,ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ సంకురి శ్రీనివాస్ గౌడ్ ,ఈఓ వీరేశం,చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి,సింగి రెడ్డి ధనపాల్ రెడ్డి,సీత రామ్ రెడ్డి,సింగి రెడ్డి వెంకట్ రెడ్డి,కాశెట్టి ప్రసాద్,పెద్ది నాగరాజ్,విట్టల్ నాయక్,నాగిళ్ల బాల్ రెడ్డి,శ్రీకాంత్ గౌడ్,అజీద్,లింగం,గోపాల్ యాదవ్,సుజీత్ రెడ్డి,ఉప్పల శ్రీనివాస్,సాకేత్,పాల్గొన్నారు.