
నారాయణపేట కేఏఎన్ పీఏస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య
//పయనించే సూర్యుడు// నారాయణపేట, జులై 12: కేఏఎన్పిఎస్ తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభలను
విజయవంతం చేయాలంటూ శుక్రవారం రోజు నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండల కేంద్రంలో కేఎన్పిఎస్ కన్వీనర్ లక్ష్మయ్య ఆధ్వర్యం లో తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా పేట జిల్లా కన్వీనర్ లక్ష్మయ్య మాట్లాడుతూ కుల అసమాన తల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభ ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హాల్ తెలంగాణ చౌరస్తా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 13న ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇట్టి మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో కే ఏ ఎన్ పి ఎస్ నాయకులు ప్యాట తిమ్మయ్య. బాట రాజు. ప్యాట వెంకటప్ప. కర్ని కృష్ణయ్య. కర్ని ఆనంద్. తదితరులు పాల్గొన్నారు.
