
పయనించే సూర్యుడు జూలై 11 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
రాష్టం లో అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి టిడిపి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు,గురువారం సూళ్లూరుపేట YSRCP కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశం లో కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ గుండాలే అని వారికి గంజాయి మత్తు ఎక్కించి దాడి చేయించారని ఆయన విమర్శించారు. నందమూరి బాలకృష్ణ మహిళలను బహిరంగ సభలో కించపరుస్తూ మాట్లాడిన రోజు టిడిపి ఎందుకు తప్పు పట్టలేదని ఆయన విమర్శించారు. ఈ మీడియా సమావేశం లో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి,పట్టణ వైసీపీ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి ,మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు మీజురు రామకృష్ణ రెడ్డి,బండిలో మహేష్ ,వైసీపీ నేతలు గాజుల ప్రసాద్,అయితా శ్రీధర్ ,అల్లూరు రమేష్ రెడ్డి,చెన్నారెడ్డి సుభ్రమణ్యం రెడ్డి, అలవల సురేష్, కాకి శ్రీరామమూర్తి ,హుసేన్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.