
తెలంగాణ మాస్టర్ గేమ్స్ లో జిల్లాకు పథకాల పంట…
పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 28 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. ఇటీవల హైదరాబాద్ లోని జింకాన గ్రౌండ్ లో జరిగిన
తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ లో హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు వంతడుపుల రఘు,( 35 ) సంవత్సరాల విభాగంలో పాల్గొని హైమర్ త్రో 21.80 మీటర్ల వేసి మొదటి స్థానంలో బంగారు పతకం, డిస్కస్ త్రో 20.50 మీటర్లు వేసి ద్వితీయ స్థానంలో వెండి పతకం, షాట్ పుట్ లో 9.50 మీటర్లు వేసి ద్వితీయ స్థానంలో వెండి పతకం సాధించి సుప్రీంకోర్టు న్యాయవాది గీతా చౌదరి, తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామారావు చే పథకాలు అందుకోవడం జరిగింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగే జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు కూడా ఎంపిక కావడం జరిగినది, ఈ సందర్భంగా రఘు తను సాధించిన పథకాలను తన గురు అయిన ఎం.ఆర్. ఖాన్ సార్ కి అంకితం చేశారు, అలాగే తనను ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ క్రీడాకారుడు ప్రభు కి కృతజ్ఞతలు తెలియజేశాడు. పథకాలు సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘు పట్ల సీనియర్ క్రీడాకారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
