
పయనించే సూర్యుడు జూలై03 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : గంగారం ఆశ్రమ ఉన్నతపాఠశాలలో సులానగర్ ప్రభుత్వ వైద్యాధికారి కందుల దినేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన పిల్లలకు చికిత్స అందించడం జరిగింది అనంతరం పిల్లలకు వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది ఎవరైనా వ్యాధులకు దూరంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చక్కటి పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యకరమని అలాగే పిల్లలు ఆహారం తీసుకునే ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత విధిగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా శుభ్రంగా నోటిని బ్రష్ చేసుకోవాలని అలాగే రెండు పూటలా స్నానం చేయాలని వదులుగా ఉన్న బట్టలు ధరించాలని తడి బట్టలు ఉపయోగించరాదని పరిశుభ్రత లోపించడం వల్ల చర్మ సంబంధితమైన అంటు వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి చాలా త్వరగా వ్యాపిస్తాయని తద్వారా నిద్రలేమితో చదువుల్లో ఆటల్లో వెనుకబడె అవకాశం ఉంటుంది కాబట్టి చక్కటి పరిశుభ్రమైన అలవాట్లు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. చర్మ సంబంధితమైన వ్యాధులు ఉన్న పిల్లల బట్టలు డెటాల్ లో ఉతికి బాగా ఎండకు ఎండిన తర్వాతనే ఉపయోగించాలని ఒకరు వాడిన బెడ్ షీట్స్ టవల్స్ బట్టలు ఎట్టి పరిస్థితుల్లో మరొకరు వాడరాదని పిల్లలకు సూచించారు ఈ కార్యక్రమంలో మొత్తం 56 మంది విద్యార్థులకు సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ కొరకు స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి దేవా సూపర్వైజర్ పోరండ్ల శ్రీనివాస్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు శైలజ హారిక ధనసరి రాంబాబు ప్రధానోపాధ్యాయులు జగన్ వార్డెన్ కిషన్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు