
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మెయిన్ బజార్ లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 11 అడుగుల బల రాముడు ఆకారంలో ఉన్న వినాయకుని ప్రతిమను మంగళవారం ఏర్పాటు చేసి 70 వేల కొత్త కరెన్సీ నోట్లతో దండ చాక్లెట్లతో దండ బెంగళూరు నుండి తెప్పించిన రకరకాల పూలతో తోమాలలు రెండు రూపాయల బిల్లలతో పూలదండలు వత్తిపత్తితో మాలలు ఏర్పాటు చేసినారు. బుధవారం ఉదయం అభిషేకము భక్తి పాటలతో భజన కార్యక్రమము రకరకాల పండ్లతో అలంకరణ పండగ రోజు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు వేద పండితులచే హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. లడ్డూ వేలం నిర్వహించి పెండేకంటి గోపాల పుల్లయ్య లడ్డు ప్రసాదాన్ని గెలుచుకోవడం జరిగింది వచ్చిన భక్తులకు అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వచ్చిన ఆర్యవైశ్య మహిళలు పురుషులు పిల్లలతో వినాయకుని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నిమజ్జన అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాడికి ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జై గణేశా జై జై గణేశా జై బోలో గణేష్ మహరాజ్ కీ జై అనే నినాదాలతో చుట్టూ ప్రాంతమంతా మారుమోగింది.
