
రుద్రూర్, ఆగస్టు 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
బీజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యేండల లక్ష్మి నారాయణ గణేష్ మండపాలకు లడ్డును పంపిణీ చేశారు. ఈ లడ్డును రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలితో పాటు అన్ని గణేష్ మండపాలకు స్థానిక మండల బిజెపి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి నాయకులు కటికే రామ్ రాజ్, అనీల్, గణేష్ మండలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.