
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లు నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 4
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో పోలవరం ముంపు ప్రాంతంలోని వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కు ఎటువంటి పరిహారం ఇవ్వద్దని కోరుతూ చింతూరు ఐటీడీఏ పీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ చింతూరు ఐటీడీఏ పరిధిలోగల ముంపు మండలాలు పూర్తిగా ఐదవ షెడ్యూల్ భూభాగానికి చెందినవని ఇక్కడ 1/70 చట్టం అమల్లో ఉందని, ఈ చట్టం ప్రకారం మైదాన ప్రాంతంలో ఉండే నాన్ ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంతానికి వలసలు రావడం నిషేధము , అలాగే ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా ఈ ప్రాంతంలో ఎటువంటి స్థిరా,చర ఆస్తులు పొందకూడదని కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వేలాది మంది నాన్ ట్రైబల్స్ చింతూరు ఐడిఏ పరిధిలోని పోలవరం ముంపు ప్రాంతాల్లోకి వలసలు వచ్చి స్థిర నివాసాలు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారందరూ ఇప్పుడు పోలవరం ప్యాకేజీ పొందటానికి సిద్ధంగా ఉన్నారని, గతంలో కూడా కొంతమంది ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వచ్చిన వారు ప్యాకేజీ పొందారని కావున చట్ట విరుద్ధంగా ముంపు మండలాల్లో నివసిస్తున్న అటువంటి నాన్ ట్రైబల్స్ కు పోలవరం ప్యాకేజీ తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన పిఓ గారిని కోరారు. అనంతరం పిఓ గారు స్పందిస్తూ దీనిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆయన తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1970 తర్వాత నుంచి చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఏజెన్సీలోని అధికారుల నిర్లక్ష్యం వలన, మరోపక్క ముడుపులు తీసుకుని తప్పుడు ఎన్ఓసిలు ఇవ్వడం మూలాన ఈరోజు వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ అందరూ రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు మీటర్లు ఇతర ధ్రువీకరణ పత్రాలు పొంది స్థానికులుగా చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తప్పుడు పద్ధతిలో పోలవరం ప్యాకేజీ పొందుతున్నారని దీని మూలాన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, అసలైన నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని అయన ఆవేదన వ్యక్తపరిచారు. గడిచిన 10 సంవత్సరాలలో కేవలం ప్యాకేజీ కోసం వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళు ముంపు మండలాల్లో కోకొల్లులుగా ఉన్నారని వారందరినీ గుర్తించి అటువంటి వారిని పోలవరం నష్ట పరిహార జాబితా నుండి తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వలస గిరిజనయేతరుల వలనే 1/70 చట్టం నీరుగారి పోయిందని, జీవో నెంబర్ 3 ని కోల్పోవలసి వచ్చిందని, కాబట్టి ఇప్పటికైనా ఆదివాసులు మేల్కొని పార్టీలకతీతంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ చేస్తున్న ఉద్యమానికి అండగా ఉంటూ 1/70 చట్టాన్ని అమలు ఉద్యమిద్దమని , వలస నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు తొలగించేలా ఉద్యమిద్దామని, అలాగే పోలవరం పరిహారంలో చట్ట విరుద్ధంగా కోట్లాది రూపాయల దండుకుంటు ప్రజాధనాన్ని దోచుకుంటున్న నాన్ ట్రైబల్స్ ను తరిమి కొడదామని ఈ సందర్భంగా ఆయన ఆదివాసులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్నారావు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
