పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి :సెంటినరీ కాలనీ -11:-
స్వర్గీయ శ్రీపాద రావు స్మారక మంథని డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ రెండవ రోజు శనివారం గెలుపొందిన జట్లకు టోర్నమెంట్ నిర్వాహకులు షీల్డ్ అందజేశారు.జట్టుల వివరాలు
మొదటి మ్యాచ్ భవానీ 11 జట్టు మీద లద్నాపూర్ జట్టు విజయం సాధించింది.రెండోవ మ్యాచ్, ఎస్ సి సి ఎల్ నాగరాజు జట్టు మీద పొలార్డ్ 11 మంథని జట్టు విజయం సాధించింది.మూడవ మ్యాచ్ చక్ దే జట్టు మీద అల్ రహీం మంథని జట్టు విజయం సాధించింగా మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారులకు షీల్డ్ లు బహూకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ ,మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీపాద కప్ కమిటీ ఆర్గనైజర్ బర్ల శ్రీనివాస్,మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,శ్రీపాద కప్ ఆర్గనైజర్ మోత్కూరు అవినాష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.