
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ డిమాండ్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి బుధవారం: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు, బుధవారం నాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని సిపిఎం మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు,ప్రజల పై భారాలు మోపుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు, ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న బిజెపి, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలపై మోయలేని భారాలు వేయడం సిగ్గు చేటన్నారు, బిజెపి ప్రభుత్వానికి ప్రజా పోరాటాల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, మండల కమిటీ సభ్యులు కడుదుల వీరన్న, కుంజ రమేష్, పూనెం స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఎండ్ న్యూస్