
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి.
పులి దేవేందర్ ముదిరాజ్ మెపా వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 19:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రోఫెషినల్స్ అసోసియేషన్) జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ అధ్వర్యంలో శనివారం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో లో ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలిని, రాష్ట్రంలోఉన్న బీసీల శాతాన్ని బట్టి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు, అచ్చునూరి కిషన్ ముదిరాజ్, బండి రాజు ముదిరాజ్ సంయుక్తంగా మాట్లాడుతూ,స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి అగ్ర వర్ణాల చేతి’లో, వారి మోసపూరిత మాటలకు బీసీ’లు అన్నిరంగాల్లో అణిచివేతకు, అవమానాలకు, అభివృద్ధి’కి, వెనుకబాటు గురి అవుతునే ఉన్నారు. కానీ వారి బతుకుల్లో ఎక్కడ మార్పు కనబడడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కలను గ్రామాల వారీగా ప్రకటించి, కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ కల్పించాలని, లేనియెడల ప్రతి జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటో చేసి బీసీల సత్తా ఏంటో నిరూపిస్తారని తెలిపారు. ఈయొక్క కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు బండి రాజు ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్, మహబూబాబాబ్ జిల్లా అధ్యక్షుడు దుండి అశోక్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పోలుదాసరి రాము ముదిరాజ్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్, చోప్పరి రాజేందర్ ముదిరాజ్, మల్లేబోయిన వెంకటేష్ ముదిరాజ్, మల్లికార్జున్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
