
ఫౌండేషన్ సేవలు విస్తృతం చేస్తామన్న అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్…
పయనిచ్చే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 18:-రిపోర్టర్ (కే శివ కృష్ణ)
మంచి మనసు సేవ భావం కలిగిన మనసున్న బిజెపి సీనియర్ నాయకులు అఖండ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జివిఎల్ మోహన్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్.. కార్యాలయంలో బుధవారం ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జివిఎల్ మోహన్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ముందుగా ఫౌండేషన్ కుటుంబ సభ్యుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ మాట్లాడుతూ; మాకు ఎంతో ఆత్మీయులు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు బిజెపి సీనియర్ నాయకులు మోహన్ గౌడ్ బాపట్ల ప్రాంత ప్రజలకు ఎంతో సుపరిచితులు అటు పార్టీకి ఇటు పౌండేషన్ కి అనేక సేవలను అందిస్తున్నారని వారి జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ సభ్యుల మధ్య జరుప కోవడం చాలా ఆనందంగా ఉందని వారి సేవలను కొనియాడారు.. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జివిఎల్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ; బాపట్ల నియోజకవర్గం లో అఖండ ఫౌండేషన్ సేవలను ప్రజలకు మరింత చేరువ కావాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు అఖండ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జివిఎల్ మోహన్ గౌడ్ అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు, మిత్రులతో కలిసి విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అఖండ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, వీటిని విస్తృతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ సభ్యులు పులిగడ్డ శ్యాంప్రసాద్, గొర్ల ఆంజనేయులు, చేజర్ల సతీష్, ఆరుమళ్ళ సుధాకర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
