
ఆకట్టుకున్న చిన్నారి శ్రీకృష్ణులు మరియు గోపికలు
ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలోని విఐపి పబ్లిక్ పాఠశాలలో ముందస్తుగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గోపికలు మరియు శ్రీకృష్ణుని వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. గోపికలు మరియు కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టి కొట్టడంతో పాటు నృత్యలతో చూపరులను ఆకట్టుకున్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ మాట్లాడుతూ… ప్రతి పండుగను పాఠశాలలో జరపడం వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని , మన సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులకు పండుగ యొక్క విశేషాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్కూలు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.