
జ్యోతిరావు పూలే బిసి సంఘం అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
జ్యోతిరావు పూలే బీసీ సంఘం,అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ అంబేద్కర్ చౌరస్తా నందు మొదటి బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 395 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి,మొదటగా ఆయన చిత్రపటానికి వివిధ సంఘాల,పార్టీల నాయకులు పూల మాలలు వేసి వాళులు అర్పించడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు పొలప్ప మాట్లాడుతూ మనువాద సంస్కృతిని సవాలు చేస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టడని,పరిపాలనలో సైతం రైతులకు పంట రుణాలను ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి రైతుల శీరోదార్యంలో మణి కిరటంగా పేరు తెచ్చుకున్నాడు అని కొనియాడారు.జ్యోతిరావు పూలే బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ మాట్లాడుతూ తన సైన్యమలో 70 శాతానికి పైగా ఈ దేశ ముస్లిం సైనికులను నియమించుకుని, ఢిల్లీ మొగులులపై వీరోచిత పోరాటాలు చేసి మరాఠ యోధుడిగా కీర్తి గడించి, మొదటి బహుజన చక్రవర్తిగా రాజ్యాధికారం చేపట్టాడని… పాలనలో సైతం ఇతర మతాల వారికి ప్రార్థన మందిరాలను కట్టించడం గాని, అన్ని మతాల వారిని సమానంగా చూడటం గాని ఇలా తనకున్న గొప్ప లౌకిక నీతిని సైతం మనువాదులు కించపరుస్తున్నారని కాబట్టి బహుజన బిడ్డలు పూలే, అంబేద్కర్ దృక్కోణం నుండి శివాజీ మహారాజ్ వాస్తవ చరిత్రను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.తర్వాత మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి . మాట్లాడుతూ మొగలాయిలకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమందిని మట్టి కర్పించిన చత్రపతి శివాజీ మహారాజ్ ఒక శూద్రుడు అయినందుకే ఆనాటి మనువాద బ్రహ్మణులు ఆయన పట్టాభిషేకాన్ని నిరాకరించి,ఘోరంగా వమానించారన్నారు.ఆయన పరిపాలన దక్షతను,కీర్తి ప్రతిష్టలను జీర్ణించుకోలేకనే హత్య చేసి ఆయన చరిత్రను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.కానీ బహుజన మేధావి అయిన మహాత్మ జ్యోతిబాపూలే 1870 సంవత్సరంలో మొదటిసారిగా చత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని కనుగొని,ఆయన జన్మదినాన్ని ఊరు,వాడలలో పాటలతో,నాటకాలతో 21 రోజుల పాటు జయంతి ఉత్సవాలను ప్రారంభించాడని చెప్పారు.ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గం అధ్యక్షులు అప్రోజ్ మాట్లాడుతూ శివాజీ తన సర్వ సైన్ అధ్యక్షులుగా డెవలత్ ఖాన్ మరియు సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలను నియమించుకున్నాడని, చివరకు ఒకానొక సందర్భంలో చత్రపతి శివాజీ మరియు ఆయన కొడుకైనా శంభాజిని ఢిల్లీ మొగలాయి రాజు తన ఇంటి శుభకార్యానికి హాజరుకావాలని పిలిపించుకొని బందీ చేసినప్పుడు కూడా వారిని విడిపించింది ఒక ముస్లిమే మతస్తుడే అని.. అయినా శివాజీ మహారాజు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తాడని హిందూ యువకులను మతోన్మాద సంస్థలు ప్రేరేపిస్తున్నాయని తన నిరసనను వ్యక్తం చేశారు.అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ . 1927 వ సంవత్సరంలో చత్రపతి శివాజీ మహారాజ్ సమాధి దగ్గర ఆయనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటారని ప్రతిజ్ఞ శారన్నారు.కుట్రపూరితంగా చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను వక్రీకరిస్తూ బహుజనులను,బహుజన బిడ్డలను మనువాదపు మత్తులోకి దించుతున్నారని..ఇది ఇంకా ఎంత కాలం కొనసాగదని, బహుజనలంతా ఏకమయే రోజులు దగ్గర పడ్డాయని ఆశ భావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పులే బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, జ్యోతిరావు పూలే బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు రఘు గుంటి, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు సలహాదారులు పోలప్ప. కె ఎన్ పి ఎస్ జిల్లా నాయకులు విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి నారాయణ, మాజీ కౌన్సిలర్ మొగులప్ప,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ ప్రెసిడెంట్ అప్రోజ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు వాకిటి భాస్కర్,అంబేద్కర్ యువజన సంఘం, ఉప్పరపల్లి అధ్యక్షులు బాల కృష్ణయ్య, జ్యోతిరావు పూలే సంఘం నాయకులు ఆంజనేయులు,బాల్ రాజ్, బి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్టి పాలెం వెంకటయ్య, టీఎమ్మార్పీఎస్ నాయకులు బొప్పల్లి వెంకటేష్,టీఎస్ఎమ్మార్పీఎస్ కృష్ణయ్య,అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ కోశాధికారి త్రిమూర్తి,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కర్రేమ్ లింగప్ప,తేజ,అక్షయ్,తల్వార్ నరేష్,కఱ్ఱెం సురేష్, రాకేష్,జుట్ల అక్షయ్,కఱ్ఱెం రమేష్, పుట్ట ఉదయ్,నాని,జగ్గలి రాజు,అనిల్, కర్రెమ్ మంజయ్య,కోరి డి.జె నవీన్,డోగి అజయ్,తదితరులు పాల్గొన్నారు