
రుద్రూర్, సెప్టెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
అంత్యోదయ, ఏకాత్మ మానవవాద సిద్ధాంత రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం పూల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఉపాధ్యక్షులు బేగరివినోద్ కుమార్, భోజిగొండ అనిల్, కోశాధికారి కాటిక రామరాజు, ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, బిజెపి మండల సీనియర్ నాయకులు పార్వతీ మురళి, చిదుర మహిపాల్, బివి గుప్తా, బూత్ అధ్యక్షులు బైండ్ల సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.