పయనించే సూర్యుడు జనవరి 10 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు.
సంబరంగా ఆడి పాడిన విద్యార్థులు
కూకట్ పల్లిలోని పల్లవి స్కూల్లో మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫిజియోథెరపిస్ట్ గంప నాగేశ్వరరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పైనే ఉందని అన్నారు. స్కూల్లో కేవలం పాఠాలు మాత్రమే ఉపాధ్యాయులు చెప్తారని భవిష్యత్తు లో ఎలా ఎదగాలనేది తల్లిదండ్రులే నేర్పించాలని సూచించారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారి పట్ల ఎలా వ్యవహరిస్తారో పెద్దయ్యాక తల్లిదండ్రుల పట్ల కూడా పిల్లలు అలానే వ్యవహరిస్తారని గుర్తు చేశారు. విద్యార్థుల్లో చదువు తోపాటు మేధో శక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. పిల్లలందరూ మంచిగా చదువుకొని దేశానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ వార్షికోత్సవంలో చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లేష్ దోళ్ల, డైరెక్టర్ రవి చంద్ర దోళ్ల ప్రిన్సిపల్ రాధిక పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు