అలరించిన చిన్నారులముగ్గులు, నృత్యం.
పయనించే సూర్యుడు జనవరి 10హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానందరెడ్డి
సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల కరస్పాండెంట్ & ప్రిన్సిపాల్ ఫాదర్ శరన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వేసిన ముగ్గులు ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి అని అన్నారు.విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నృత్యం చేశారు. విద్యార్థులు వేసిన ముగ్గుల లో సెలెక్ట్ చేసి ఫస్ట్,సెకండ్,థర్డ్, కన్సోలేషన్ ప్రైస్ లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.