
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 8(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలోని శాంతి నగర్ నందు గల దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. యస్.రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి సందర్బంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న యాడికి మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, బొంబాయి రమేష్ నాయుడు, స్టేట్ జాయింట్ సెక్రటరీ వెన్నపూస వెంకటరామి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి, మండల కన్వీనర్ సంజీవ రాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, బ్రహ్మానంద రెడ్డి, బాల రమేష్ బాబు, చిట్టెం రెడ్డి బాల్ రెడ్డి మండల నాయకులు,ఎం.పీ.టీ.సీ. సభ్యులు, వార్డ్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.
