
పయనించే// సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి5 మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధవార్ గ్రామంలో బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం ఉత్సవా మూడవరోజు గ్రామం గట్టు తిమ్మప్ప దేవాలయం దగ్గర భక్తులు భారీ సంఖ్యలో గుట్ట దగ్గరికి చేరుకొని పోరా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించి అనంతరం భక్తులు గోవింద నామ స్వరంతో తమ మొక్కులు జ్యోతితో మొక్కులు సమర్పించుకున్నారు దాండియా కార్యక్రమాలు భజనల కోలాటాలు ఆడుతూ ఆలయం దగ్గర కొండపై ఉన్న గట్టు తిమ్మప్ప స్వామి వారికి కిందకి తీసుకువచ్చి సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు గోవింద నామ స్మరణలతో శ్రీ గట్టు తిమ్మప్ప కొండలు మారుమోగాయి అలాగే వివేకానంద యూత్ మండలి వారి ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా కార్యక్రమం రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో నిర్వాహకులు ఆలయ ధర్మకర్త వైష్ణవం సురేందర్. ఆలయ కమిటీ చైర్మన్. రాజేశ్వరరావు. మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి. గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు