
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్.
పయనించి సూర్యుడు// న్యూస్// మార్చ్ 10//మక్తల్
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి గారి 128వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి *నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్రలోని సతార జిల్లా నైగాన్ గ్రామంలో పుట్టిన సావిత్రి భాయి ఫూలే తన భర్త మహాత్మ జ్యోతిబాపూలే గారి ద్వారా విద్య నేర్చుకొని మొట్టమొదటిసారిగా 1848 లో పాఠశాలను ఏర్పాటు చేసి దేశంలోనే బాలికలకు చదువు చెప్పి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తి గడించిందన్నారు. మహిళలను అణిచివేసిన మనువాద బ్రాహ్మణిజాన్ని విద్య ద్వారానే రూపుమాపవచ్చని చుట్టూ గ్రామాలలో మరియు దేశవ్యాప్తంగా 52 పాఠశాలలను ఏర్పాటుచేసి బాలికలకు చదువు కొరకు ఏర్పాటు చేశారని… ఈనాడు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతుండడానికి,ఆనాడు సావిత్రిబాయి పూలే చేసిన కృషియే ప్రధాన కారణమని…. దానిలో భాగంగానే నేడు రాజకీయ పదవులు,అంతరిక్ష యాత్రలు,విమానాలను,రైళ్లను నడపడం,సైనిక, ఐఏఎస్,ఐపీఎస్, ఉపాధ్యాయ ఇలా అన్ని రంగాలలో రాణిస్తున్నారని వారి గొప్పతనాన్ని కీర్తించారు. nఅదే విధంగా సమాజంలోని కుల వ్యవస్థకు, పురుషాధిపత్య ఆచారాలకు,కట్టుబాట్లు వ్యతిరేకంగా 1873లో సత్యశోధక్ సమాజం ను ఏర్పాటు చేసి బాల్య వివాహాలను నిరోధించడం, వితంతు పునర్వివాహాలను జరిపించడం, సతీసాగమనం వంటి దురాచారాలను రూపుమాపేందుకు కృషి చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో తన భర్త అయిన మహాత్మ పూలే చితికి తానే నిప్పు పెట్టిందన్నారు. 1877 ఆ ప్రాంతంలో లేగు వంటి భయంకర వ్యాధులు వచ్చి ప్రజలు చనిపోతే ఉంటే వారికి చికిత్స చేయడానికి వెళుతున్న తన తల్లిని దత్తపుత్రుడు యశ్వంత్ కుమార్ అమ్మ వెళ్లవద్దు … ఆ మహమ్మారి వ్యాధి నీకు వస్తుందని నిలువరించే ప్రయత్నం చేసినప్పుడు అంటరాని ప్రజలకు వైద్యం చేయడానికి ఎవరు ముందుకు రారని చెప్పి వారిని చేరదీసిన మహనీయురాలు సావిత్రిబాయి అని చివరకు ఆమె అదే ప్లేగు వ్యాధితో చనిపోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ … ఈమెనే నిజమైన భారతమాత ఉద్ఘాటించారు. ఈ ఈనాటికైనా రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా మనం కూడా వారిలానే సమాజ శ్రేయస్సు కొరకై నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నారు వారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, అధ్యక్షులు పోలప్ప, జ్యోతిరావు పూలే బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్,బీఎస్పీ అసెంబ్లీ ఇన్చార్జ్ పాలెం వెంకటయ్య, కేఎన్పీఎస్ నాయకులు విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు జీర్గల్ నాగేష్, రాకేష్,ఆర్టీఐ జిల్లా నాయకులు గొల్లపల్లి నారాయణ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పోర్ల నరసింహులు, బిహెచ్పిఎస్ ప్రధాన కార్యదర్శి కళ్యాణం రాజు, యాదగిరి జిల్లా అధ్యక్షులు మల్లయ్య, స్వేరో రవికుమార్, అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ సభ్యులు తల్వార్ నరేష్,శ్రీహరి బ్యాగరి,తేజ,రమేష్,మారుతి,అనిల్,గణేష్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
