
పయనించే సూర్యుడు బాపట్ల మే 2:- రిపోర్టర్ (కే శివ కృష్ణ)
ముందుగా పాకాలకు విచ్చేసిన పులివర్తి సుధా రెడ్డి కి ఘన స్వాగతం పలికిన కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు. పాకాల పట్టణంలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన పులివర్తి సుధారెడ్డి.పాకాల పట్టణంలోని ఉత్సాహవంతులైన మహిళలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం.రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో చైతన్యం రావాలి… అత్యాధునిక సాంకేతికతను అంది పుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలి సంకల్పంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం.స్వయం ఉపాధి అవకాశాలలో భాగంగా ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ తో పాటు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.మహిళలు ఆర్థికంగా వ్యాపార, స్వయం ఉపాధి అవకాశాలలో ముందు ఉండాలని ముందుచూపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ మహిళలకు ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం.చంద్రగిరి నియోజకవర్గంలో మహిళల ఆర్థికంగా ఎదగడమే నా ప్రధమ లక్ష్యం అని తెలిపిన పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళలందరూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో చేపడుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం, జ్యూట్ బ్యాగ్, స్వయం ఉపాధి అవకాశాలు, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఇతర పథకాలలో మహిళలు పాల్గొని చంద్రగిరి నియోజవర్గానికి గొప్ప పేరు తేవాలని మహిళలకు పిలుపునిచ్చిన పులివర్తి సుధా రెడ్డి. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

