పయనించే సూర్యుడు // జనవరి 12//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
చతిస్ ఘడ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్ డి మాక్స్ ద్, లు డిమాండ్ చేశారు. వాస్తవాలను వెలికి తీసే జర్నలిస్టులను హత్య చేసి భయభ్రాంతులకు గురిచేయాలనుకోవడం అవినీతిపరుల అవివేకం అవుతుందన్నారు. జర్నలిస్టులను హత్యలు చేయడం భౌతిక దాడులకు పాల్పడితే జర్నలిస్టులు భయపడరనే,, విషయాన్ని అక్రమార్కులు, ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. అవినీతి కాంట్రాక్టర్ల తిరు పై, వారికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాల వైఖరిపై, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అంశం చాలా కాలంగా పెండింగ్లో ఉందని, ఆ చట్టాన్ని వెంటనే కేంద్ర,,,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలన్నారు. అవినీతి వెలికి తీసే జర్నలిస్టులను చంపినంత మాత్రాన నిజాయితీ గల జర్నలిస్టులు ఎవరు భయపడరని, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.