పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 26 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండలోని ఎల్.టి.ఆర్ కేసులు మరియు ఏజెన్సీ భూ సమస్యల పరిష్కారం కోసం చింతూరు ఐ.టి.డి.ఏ లో ట్రైబల్ న్యాయవాదులతో కూడిన లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని న్యాయవాది మడివి రవితేజ కోరారు. చింతూరు ఐ.టి.డి.ఎ. అధికారులు ఎల్.టి.ఆర్ కేసుల ఫిర్యాదుల స్వీకరణ కోసం సెల్ మరియు ప్రతి బుధవారం ట్రైబల్ వెల్ఫేర్ కోర్టు ఏర్పాటు ను స్వాగతిస్తున్నాము. అలాగే ట్రైబల్ న్యాయవాదులతో కూడిన ట్రైబల్ లీగల్ సెల్ ఏర్పాటు చెయ్యకపోతే ఎల్.టి.ఆర్ కేసుల పరిష్కారం లో తాత్సారం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. గిరిజన ఫిర్యాదుదారులకు తగిన న్యాయం జరగాలంటే ట్రైబల్ లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

