
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 8
ఈరోజు స్వర్గీయ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతిని చింతూరు మండల కేంద్రంలోని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర అత్యంత ఉత్సాహభరితంగా జయంతిని నిర్వహించుకోవడం జరిగింది… ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అలాగే రాబోవు ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు కలలు నెరవేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు….అలాగే రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చాలని వారు కోరారు…. కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని…. బీసీలకు 50 సంవత్సరములకే పెన్షన్ ఇస్తానని చెప్పిన విధముగా 50 సంవత్సరములు నిండిన బీసీ వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని…. ఉచితముగా ప్రయాణం చేయటానికి బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పిన విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని…. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా రైతులకి ఇస్తానని చెప్పిన 20వేల రూపాయలు ఇవ్వాలని…. ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తానని చెప్పిన విధంగా నెలకి 1500 చొప్పున ఇప్పటికి రావలసిన 18 వేల రూపాయలు ఇవ్వాలని…. అలాగే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతిని ఇప్పటికీ 12 నెలలకి రావలసిన 36 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు…. ఇన్ని హామీలుఇచ్చి… వాటిని అమలు చేస్తామని మీరు చెబితే ప్రజలు నమ్మి మీకు ఇంత భారీ మెజారిటీ ఇచ్చి మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలలో అమ్మ ఒడి అది కూడా అరాకొరగా (చాలామందికి రాలేదు)… ఇచ్చి గ్రామాలలో తిరుగుతూ అన్నీ ఇచ్చేసామని చెప్పుకుంటున్న మీ యొక్క తీరును చూస్తే జాలేస్తుంది…. ఇప్పటికైనా ప్రజలని మోసం చేయకుండా మీ మీద పెట్టుకున్న ప్రజల నమ్మకాల్ని వమ్ము చేయకుండా ఇస్తానన్నటువంటి పథకాలన్నీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము… ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వై.రామలింగారెడ్డి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ మేడేపల్లి శ్రీ సుధాకర్, ఎంపీటీసీ సున్నం నాగరాజు, కోఆప్షన్ మెంబర్ MD. జి క్రియా , సర్పంచ్ లు కారం కన్నారావు, అగరం సుబ్బలక్ష్మి, కాకా అరుణ కుమారి, కుంజ తిరుపతిరావు, నాయకులు కోట్ల కృష్ణ, ఎస్కే కాజా, యూత్ అధ్యక్షులు మడివి రాజు, మానే సత్యనారాయణ,కత్తిక నంద కిషోర్, పరాంకుశం మురళి, పాండ్రు మహేష్, కారం సాయి బాబా, మినప వెంకట్రావు, తుర్రం వెంకటేశ్వర్లు,ధర్మల విప్లవ కుమార్, జటాయి నానాజీ, కమ్మాల జయరాజు, కాక సీతారామయ్య,పోడియం రాంబాబు, బిక్షం, సూర్యనారాయణ, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, తుర్రం రాముడు, తుర్రం వీరయ్య, మయూరి నారాయణ, తుర్రం శ్రీను, దుమ్మిరి బ్రహ్మయ్య,కరీముల్లా,షహేన్షా (పండు ), షరీఫ్, ఫయాజ్, పోసి బాబు, రేవు గణేష్, ప్రభు, అచ్చే గణపతి తదితరులు పాల్గొన్నారు.