
పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 (ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నేషనల్ స్కూల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్లో విజయం సాధించిన చేజర్ల హై స్కూల్ విద్యార్థులు. డ్రీం వర్క్ ఆర్ట్ గ్యాలరీ సంస్థ . విజయవాడలో నిర్వహించిన చిత్రకళ పోటీలో చేజర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభను చూపి గోల్డ్ . సిల్వర్ మెడల్ లు సాధించారు. సీనియర్స్ విభాగంలో సాయి శశాంక్ గోల్డ్ మెడల్ రాగా , జూనియర్ విభాగంలో కామాక్షి ఇషాని గోల్డ్ మెడల్, వైష్ణవి, మంజు నాయక్, సిల్వర్ మెడల్స్, సబ్ జూనియర్ విభాగంలో పి చైతన్య గోల్డ్ మెడల్, ఎన్ నోక్షిత సిల్వర్ మెడల్ సాధించారు. అతి తక్కువ కాలంలో నేషనల్ స్కూల్ లెవెల్ కాంపిటీషన్ కు విద్యార్థులను తీర్చిదిద్దిన డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్ ను. ప్రధానోపాధ్యాయురాలు పి హైమావతి తోటి సిబ్బంది అభినందించారు. డ్రాయింగ్ మాస్టర్ తో లైవ్ డెమో చేయించి చిరు సత్కారం చేశారు.