
పయనించేసూర్యుడు,జనవరి 21,కాప్రా ప్రతినిధి సింగం రాజు:ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి,చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్యఅతిథులుగావిచ్చేసి చిల్కానగర్ డివిజన్లోని సుమారు 49 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నపలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు.39 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బ్యాంక్ కాలనీ మొదటి అంతస్తు సంక్షేమ సంగం భవన నిర్మాణ శంకుస్థాపననార్త్ కళ్యాణపురి పార్కులో 10 లక్షలవ్యయంతోఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం.అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని దశలవారీగా తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని బ్యాంక్ కాలనీలోని సంక్షేమ సంగం మొదటి అంతస్తు భవనాన్ని నిర్మిస్తామని గతంలో ఇచ్చిన మాట ప్రకారం గామంగళవారం మొదటి అంతస్తు ప్రారంభోత్సవం చేసుకున్నామని తెలిపారు, అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ దంపతులు ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాసంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతూ ముందుకు సాగుతున్నారని వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు.కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి కాలనీలోబస్తీలో సంక్షేమ సంఘాల బలోపేతం ఎంతో అవసరమని ఈ సంక్షేమ సంఘాల ద్వారానే కాలనీలు అభివృద్ధికిదోహదపడతాయని ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో ఉంటుందనికొనియాడారు.అదేవిధంగా తమ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకుసాగుతున్నామని మాగెలుపుకుసహకరించిన ప్రతి ఒక్కరికి ఇలా పనుల ద్వారా రుణం తీర్చుకుంటున్నామని తెలిపారు,చిల్కానగర్ డివిజన్లోసుమారు80 కోట్ల నిధులతోఇప్పటివరకు అభివృద్ధిజరిగిందనిచాలాసంతోషంగాఉందనితెలుపుతూముఖ్యంగాఈఅభివృద్ధికిపెద్దఎత్తున నిధులకు సహకరిస్తున్న మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికిప్రత్యేకంగాధన్యవాదాలుకృతజ్ఞతలుతెలిపారు.ఈ కార్యక్రమంలోజిహెచ్ఎంసిఅధికారులు,బిఆర్ఎస్ పార్టీనాయకులు,కాలనీసంక్షేమ సంఘంసభ్యులు,మహిళా నాయకురాలు,మొదలగువారుపెద్దఎత్తున పాల్గొన్నారు.