పయనించే సూర్యుడు జనవరి 24 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలో ఉన్న డివైడర్ పై మొక్కలు నాటుతున్న కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, సమస్త జీవ కోటికి ప్రాణధారం మొక్కలు అని, అడవుల శాతం పెంచే లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి-వాటిని కాపాడాలని అన్నారు. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. మన భావితరాల బాగుండాలంటే ప్రకృతిని కాపాడి పచ్చదనాన్ని వారికి బహుమతిగా అందించాలని తెలియచేసారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం తో పాటు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని తెలియచేసారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, రవీందర్, యు బి డి సూపర్వైజర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
చెట్లు నటుదాం..పచ్చదనాన్ని పెంచుదాం.. స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్*
RELATED ARTICLES