
” అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి ఆనం
పయనించే సూర్యుడు జులై 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం
మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ సెంటర్లోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి ఆనం .చేజర్లలోని పెద్ద చెరువు .గ్రామకొలను. ఆధునీకరణ పనులకు ఉపాధి హామీ నిధులు రూ. 1.25 కోట్లతో శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలిఅడుగు పూర్తి చేసుకుంది గత ప్రభుత్వ హయాంలో విసిగి వేసారిన ప్రజలకు ఎన్డీఏ కూటమి ఒక వెలుగుదివ్వెలా కనిపించింది.అత్యధిక మెజార్టీతో 164 స్థానాలు అందించి కూటమి ప్రభుత్వాన్ని అద్వితీయంగా ఆశీర్వదించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్య దక్షత, అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు
ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్కొకటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజల ఆస్తులు కాజేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అధికారంలోకి రాగానే రద్దుచేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాం. గత ముఖ్యమంత్రి ఫోటోలు తొలగించి ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించాం అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలిని తీరుస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 68 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచి అందిస్తున్నాం ఉచితంగా దీపం గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నాం ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయిలో తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాలకు జమచేశాం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 27124 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు 13 వేల రూపాయల చొప్పున మొత్తం 35 కోట్ల 26 లక్షల 12 వేల రూపాయలు జమచేశాం .త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం హామీలు అమలు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారు పేదల సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం సిమెంట్ రోడ్లు, సైడ్ కాలవలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం ఆత్మకూరు నియోజకవర్గంలో 369 సీసీ రోడ్లు పనులను రూ 22.59 కోట్లు నిధులు వెచ్చించి నిర్మిస్తున్నాం త్వరలోనే చేజర్ల లోని 16వ శతాబ్దానికి చెందిన చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తాం. అంచనాలు, డిజైన్లు రూపొందించమని అధికారులను ఆదేశించాం అలాగే పెరుమాళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పించాం ప్రతి గడపకు వెళ్లి ఈ ఏడాదిలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం ప్రజలకు చెప్పినవన్నీ చేసుకుంటూపోతున్నాం.ఇంకా ఏంకావాలో అడిగి చేయబోతున్నాం.ఇదే సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు.టిడిపి మండల అధ్యక్షుడు షేక్ . సిరాజురుద్దీన్. స్థానిక మాజీ గ్రామ సర్పంచి రావి. లక్ష్మీ నరసారెడ్డి. జిల్లా టిడిపి పార్లమెంటరీ సెక్రెటరీ .రావి పెంచల రెడ్డి. సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు. కేశవ చౌదరి. ఉడత. హజరత్తయ్య. మోదేపల్లి పెంచలనాయుడు. కిలారి జయంతి నాయుడు. కొమ్మి.సిద్దుల నాయుడు. చేజర్ల చెరువు చైర్మన్. అరవ గోపిరెడ్డి . గోనుగుంట రాంబాబు. సొసైటీ అధ్యక్షులు. బి. వీర రాఘవరెడ్డి. మండల నాయకులు. కార్యకర్తలు అభిమానులు మండలంలోని అన్ని శాఖల తదితరులు పాల్గొన్నారు
