
“స్పందన హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
చేజర్ల మండలం నాగులవెల్లటూరు జడ్పీ హైస్కూల్‌లో బయాలజీ సైన్స్ టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో డిప్యూటీ డి.ఈ.ఓ ఎం.వి జానకిరామ్, ఎం.ఈ.ఓ డి.సి మస్తానయ్య తక్షణమే హైస్కూల్‌ను సందర్శించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసి కమిటీ సభ్యులతో మాట్లాడిన అధికారులు సమస్యను వివరంగా తెలుసుకున్నారు. తాత్కాలికంగా బయాలజీ సైన్స్ టీచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఉపశమనం పొందగా, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగులవెల్లటూరు గ్రామ ప్రజలు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి , తాళ్లూరి గిరినాయుడు కి, అలాగే సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి కి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంత వేగంగా చర్యలు తీసుకున్నందుకు ప్రజలు అభినందనలు తెలిపారు.