
//పయనించే సూర్యుడు// జులై 26//మక్తల్
జన సురక్ష క్యాంపైన్లో భాగంగా మక్తల్ మండలం మద్వార్ గ్రామంలో DCCB బ్యాంకు మక్తల్ బ్రాంచ్ మరియు ఆర్ధిక అక్షరాస్యత కేంద్రం. బ్యాంకు అధికారులుతో కలిసి జన సురక్ష క్యాంపు కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DCCB మేనేజర్ ఆంజనేయులు. మరియు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్స్ మహేందర్ . రాఘవేంద్ర మరియు బ్యాంకు సిబ్బంది CFL కౌన్సిలర్ రవి కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికీ బ్యాంకులో అందించే ఇన్సూరెన్స్ లు అయినా PMJJBY, PMSBY, APY గురించి మేనేజర్ సార్ వివరంగా చెప్పడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే విషయం గురించి వారికి అవగాహన చేయించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల్లో గల పథకాలైన SSY, APY ల తోబాటు RUPAY డెబిట్ కార్డు వాడడం వల్ల పొందే ప్రమాద బీమా గురించి అవగాహన కల్పించడం జరిగింది వీటితోపాటు ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో వారికి చెబుతూ, ఒకవేళ సైబర్ మోసానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని సార్ చెప్పడం జరిగింది. పాల్గొన్న వారందరికీ కూడా బ్యాంకు సంబంధించిన పాంప్లెట్స్ అందించడం జరిగింది.

