పయనించే సూర్యుడు, జనవరి 10, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా.
దేవరకొండ టౌన్ న్యూస్, ఎమ్మార్పీఎస్ టీజీ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ తలపెట్టిన మాదిగల మహా గర్జన సభ జనవరి 19న ఇందిరా పార్కులో జరిగేటటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జ్ పోత్తేం సహదేవుడు మాదిగ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య మాదిగ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదిగొండ ఎల్లేష్ మాదిగ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల మహా గర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అనేక పోరాటాలు నిర్వహించాం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తుది దశకు చేరింది ఉద్యమంలో భాగంగా అమరులైన మాదిగలకు జోహార్లు తెలిపారు 2024 ఆగస్టు 1న ఏడుగురు జడ్జీల సమక్షంలో సుప్రీంకోర్టు ధర్మసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చరిత్రక ఘటం అని వారు అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరితగతిన ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని వారు కోరినారు నిండు అసెంబ్లీలో మాదిగలది న్యాయమైన డిమాండ్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి వాళ్ళు పండగ చేసుకోవాలని ఎస్సీ వర్గీకరణ దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించారు ఇచ్చిన మాట తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు జనవరి 19న ఇందిరా పార్కులో జరగబోయే మాదిగల మహా గర్జన సభకు దేవరకొండ నియోజకవర్గం నుంచి వేలాదిగా మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కరపత్రం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర ఆంజనేయులు నల్గొండ జిల్లా కార్యదర్శి ఆరెకంటి ఏసయ్య దేవరకొండ నియోజకవర్గం కన్వీనర్ ఎర్ర యాదగిరి ఎమ్మార్పీఎస్ దేవరకొండ నియోజకవర్గ అధికార ప్రతినిధి అందుగుల సీతయ్య మాతంగి శ్రీను దేవరకొండ పట్టణ నాయకులు పొట్ట ప్రభు కొండమల్లేపల్లి మండల అధ్యక్షుడు అనేపాక సంజీవ గుడిపల్లి మండల అధ్యక్షులు వంశీ పీఏ పల్లి మండల అధికార ప్రతినిధి గండు సుధాకర్ వస్కుల లక్ష్మయ్య ఎమ్మార్పీఎస్ యువసేన నాయకులు ముత్యాలు వస్కుల ముత్యాలు దున్న ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.