
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ దేశంలో ఏ మూలన ఉన్న జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ముయ్యబోయిన ఉమాదేవి కుమారుడు అగ్ని ప్రమాదం కారణంగా శరీర భాగాలు కాలడంతో వారిని వారి కుటుంబ సభ్యులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి జనసేన పార్టీ నుంచి భరోసా కల్పిస్తూ పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమునుగు రవి, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ డేగల రాము, జీలుగుమిల్లి మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.