
పయనించే సూర్యుడు న్యూస్ జులై 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన, ప్రజాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో నలుమూలలా పేరుకుపోయిన డ్రగ్ మాఫియాను కూకటివేలతో పెకిలించి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసే దాంట్లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను సభ్యులుగా చేస్తూ ప్రహరీ క్లబ్ ను కచ్చితంగా ఏర్పాటు చేయాలని 2024 జూలై నెలలో ప్రభుత్వం ఉత్తర్వులను ఆదేశించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో భాగంగా ప్రతి పాఠశాలలో కూడా ఖచ్చితంగా ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర జవహర్ బాల్ మంచ్ చైర్మన్ మామిడి రిషికేశ్ రెడ్డి మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ జిట్టా సునీల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యా కమిషన్ మెంబర్ ప్రొఫెసర్ పి ల్ విశ్వేశ్వరరావు కి, బాలల హక్కుల పరిరక్షణా కమీషను మెంబర్లు బి వచన్ కుమార్,యమ్ చందన ,కె వందన గౌడ్, ప్రేమలత అగర్వాల్ కి కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ జిట్టా సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల నందు కచ్చితంగా రాష్ట్ర ఆదేశాలనుసారంగా ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో డ్రగ్ రూపుమాపడంలో రాష్ట్ర అధికారులు విద్యాశాఖ అధికారులు ముందుండి భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్రను పోషించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ బాల్ మంచ్ సభ్యులు పి యేల్ ప్రవీణ్ కుమార్ ,యన్ సాయి కృష్ణ, వి సంతోష్, జి జనీష్, మైతి, పూజ పాల్గొన్నారు .
