పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్9(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలంలోని యాడికి గ్రామంలో రైతులకు జాతీయ ఆహార భద్రత మిషన్ లో భాగంగా పంటలపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుత్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకట రాముడు హాజరు కావడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కంది పంటలో సమగ్ర సస్యరక్షణ పై పలు సూచనలు చేశారు. కంది పంటలో ముఖ్యంగా ఆకు చుట్టుపురుగు, మారుకా మచ్చల పురుగు, కాయ ఈగ, కాయతోలుచు పురుగు ఇబ్బంది కలిగిస్తాయని వాటి నివారణకు పూత దశలో ఉన్నట్లయితే డైమితోయేట్ 300 యం. ఎల్ లీటర్ నీటికి లేదా తయోమితాబ్జామ్ 50 గ్రాములు ఎకరానికి వాడాలి. పిందే ఏర్పడుతున్న దశలో ఉన్నట్లయితే నోవల్యూరాన్ ప్లస్ లాంబ్డా సై హాలోత్రున్ 200 ఎం. ఎల్. ఎకరానికి, గింజ ఏర్పడుతున్న దశలో అయితే క్లోరమ్త్రిప్రోల్ 60 మిల్లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 100 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకొని పంట ను కాపాడుకోవాలన్నారు. అలాగే రైతులందరూ కూడా సాగు చేస్తున్న పంటలకు పంట నమోదు మరియు పంట బీమాను తప్పనిసరిగా చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, గ్రామ వ్యవసాయ అధికారులు రమేష్, రాంబాబు, యతీష, నాగలక్ష్మి నిజాముద్దీన్, సాగర్, వర్ష మరియు యాడికి నిట్టూరు రైతులు పాల్గొన్నారు.



