
పయనించే సూర్యుడు జూలై 11 పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి సోమవారం:జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిల్లలకు నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ అనే మాత్రను పిల్లలకు నోటి ద్వారా మింగించడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే చాలా వ్యాధులు రాకుండా3 కాపాడుకోవచ్చని కాబట్టి పిల్లలందరూ స్కూల్ పరిసరాలు మరియు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా పిల్లల పొట్టలో నులిపురుగులు ఉండడంవల్ల రక్తహీనత వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం మగత అలసట తరచూ వ్యాధుల బారిన పడటం తద్వారా చదువుల్లో ఆటల్లో వెనుకబడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నులి పురుగుల నివారణ టాబ్లెట్లను సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలు అందరూ తప్పనిసరిగా మింగాలని ఈ సందర్భంగా పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకు సూచించారు అదేవిధంగా నులి పురుగుల నివారణకు తినేటప్పుడు త్రాగేటప్పుడు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు పరిశుభ్రం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని ఉపయోగించుకోవాలని పండ్లు కూరగాయలు పరిశుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించుకోవాలని పిల్లలకు ఆరోగ్య విద్యా బోధన చేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కందుల దినేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు మరియు ఉపాధ్యాయులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి ఆరోగ్య విస్తరణ అధికారి దేవా సూపర్వైజర్ గుజ్జ విజయ, నాగు బండి వెంకటేశ్వర్లు, కోరం సురేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీ లాల్ నాయక్ పెద్దలు రెడ్యానాయక్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు