
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్) ఆదివారం నారాయణపేట లో డ్రాగన్ షాటోకన్ కరాటే అసోసియేషన్ అధ్యర్యంలో జరిగిన 24th నేషనల్ కరాటే అండ్ కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్ షిప్ – 2025 లో షాద్ నగర్ కు చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబర్చి మెడల్స్, సర్టిఫికెట్స్, కప్ గెలుపొందారు. ఇందులో పృథ్వి అనే విద్యార్థి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు.ఈ సందర్బంగా న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్స్ బాలరాజ్, అహ్మద్ ఖాన్ లు మాట్లాడుతూ నేటి సమాజం లో చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని కుంగ్ ఫు, కరాటే లతో ఆత్మరక్షణ తో పాటు శరీరం దృడంగా ఉంటుందని దీని ద్వారా మేధస్సు శక్తివంతం అవుతుందని తెలిపారు. ప్రతిఒక్కరు కుంగ్ ఫు, కరాటే నేర్చుకోవాలని అన్నారు.