
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 22
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం లో జీడిగుప్ప పి హెచ్ సి ఆధ్వర్యంలో వైద్యాధికారులు డాక్టర్ నిరంజన్ కుమార్, డాక్టర్ హేమంత్ ల నేత్రుత్వంలో సోమవారం జీడిగుప్పలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు విచ్చేసిన చింతూరు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పుల్లయ్య మాట్లాడుతూ.. ప్రధానమంత్రు నరేంద్ర మోదీ 75 వ జన్మ దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా శక్తి వంతమైన కుటుంభం కోసం – ఆరోగ్యావంతమైన మహి ఆవశ్యకత గుర్తుచేస్తూ.. స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టారని, ఈ కార్యక్రమ స్ఫూర్తిని ప్రజా ప్రతినిధులు ప్రజారోగ్యంలో మహిళా ఆరోగ్యం అత్యంత కీలకమైనదని ప్రజలను చైతన్య పరుస్తూ ఆరోగ్యావంతమైన జీవనానికి వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రమైన నీరు, సమతుల ఆహారం, కీలకమని, అలానే స్థానిక అంగన్వాడీ, ఆరోగ్య, వైద్య సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అలానే జడ్ పి టి సి వల్ల రంగారెడ్డి మాట్లాడుతూ చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని, ఆరోగ్యమే మహాభాగ్యమని, అనారోగ్యబారిన పడి అనేక కుటుంబాలు ఆర్థికంగా పతనం ఔతున్నాయని, ఆ పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త వాహించడమే ఉత్తమమని అదే శక్తివాంతమైన కుటుంబ, సమాజ నిర్మాణానికి మూలమని ప్రజలందరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ వైద్యుల సలహాల మేరకు ఆరోగ్య నియమాలను పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి టి సి వల్ల వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచి మూట్ల బాలరాజు, ఉప సర్పంచి కుంజా రమేష్, వై సి పి నాయకులు పొడియం గోపాల్, జనసేన నాయకులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి, సి పి ఎం నాయకులు కదల కొండయ్య రెడ్డి, పి హెచ్ సి సుబ్యూనిటీ ఆఫీసర్ సమ్మయ్య, ఫిమేల్ సువర్వైజర్ పున్నమ్మ,సి హెచ్ ఓ, ఫార్మాసిస్ట్, ఎల్ టి, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
