
ఆదర్శ తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐ. ఎఫ్. టి. యు టేకులపల్లి మండల కమిటీ పిలుపు
పయనించే సూర్యుడు జులై 07 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్ ఆదర్శతెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు టేకలపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు మూడు బిచ్చు ఈసం మహేష్ పిలుపునిచ్చారు సోమవారం టేకులపల్లి ఎంపీడీవో మల్లేశ్వరి కి సమ్మె నోటీస్ ఇచ్చిన అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను రద్దుచేసి నాలుగు కోడులు తీసుకురా వడ్డాన్ని వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనము 26 వేల రూపాయలు ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నాయకులు ఎర్రయ్య, జంపన్న, అన్నాజీ, మహేష్, బిచ్చు ,గోపా, బాబు , గుంటి భాస్కర్, లాలు, నెహ్రూ, సురేష్,తదితరులు పాల్గొన్నారు.