Saturday, October 25, 2025
Homeఆంధ్రప్రదేశ్జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సజావుగా నిర్వహణకు నోడల్ అధికారుల నియామకంజిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సజావుగా నిర్వహణకు నోడల్ అధికారుల నియామకంజిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 6 (పొనకంటి ఉపేందర్ రావు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగబోయే జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు వివిధ విభాగాల నోడల్ అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రతీ దశలో సమన్వయంతో పనిచేసి, విధి నిర్వహణలో ఏ లోపం చోటు చేసుకోకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా స్థాయిలో వివిధ కార్యకలాపాలకు క్రింది అధికారులు నోడల్ అధికారులుగా నియమితులయ్యారు:మానవ వనరుల నిర్వహణకు (Man Power Management) – బి. నాగలక్ష్మి, జిల్లా విద్యా అధికారి.బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణకు (Ballot Box Management) – జె. నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి.రవాణా నిర్వహణకు (Transport Management) – వెంకట రమణ, జిల్లా రవాణా అధికారి.
శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు (Training Management) – కె. శ్రీరామ్, జిల్లా ఉపాధి అధికారి మరియు సాయి కృష్ణ, సబ్జెక్ట్ అసిస్టెంట్, విద్యా శాఖ.
సామగ్రి నిర్వహణకు (Material Management) – జి. దినేశ్ కుమార్, సహాయ సంచాలకుడు (మైన్స్ & జియాలజీ) మరియు వై.టి.టి.వి. రమణ రావు, అకౌంట్స్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం.ఎంసీసీ (Model Code of Conduct) మరియు ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు (Expenditure Accounts Monitoring) ఎం. విద్యా చందన, (ఎల్.బీ.) & జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్‌డిఏ).వ్యయ గణాంకాల సేకరణకు – కె. సంజీవరావు, జిల్లా ప్రణాళిక అధికారి.అభ్యర్థుల ఖర్చు లెక్కల పర్యవేక్షణకు – జి. శ్రీనివాస్, జిల్లా ఆడిట్ అధికారి.ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు డేటా పర్యవేక్షణకు – మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల జనరల్ మేనేజర్.మోడల్ కోడ్ ఉల్లంఘన కేసుల పరిశీలనకు ఎం. శ్రీనివాస్ చౌదరి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ బ్రాంచ్.చట్టపరమైన కేసుల నమోదు మరియు చర్యలకు – శ్రీ చి. శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్, స్పెషల్ బ్రాంచ్.ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి (Expenditure Monitoring) – ఎ. శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి.ఆబ్జర్వర్ల సమన్వయానికి (Observer Coordination) – ఎస్. త్రినాథ్ బాబు, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్.బ్యాలెట్ పేపర్ ముద్రణ మరియు పోస్టల్ బ్యాలెట్ పంపిణీకి (Ballot Paper & Postal Ballot Printing & Distribution) – వి. బాబు రావు, జిల్లా వ్యవసాయ అధికారి.మీడియా కమ్యూనికేషన్ మరియు సమాచార ప్రసారానికి (Media Communication) మొహమ్మద్ అజ్గర్ హుస్సేన్, జిల్లా పౌర సంబంధాల అధికారి.హెల్ప్‌లైన్ మరియు ఫిర్యాదుల పరిష్కారానికి (Helpline & Complaint Redressal) – శ్రీరామ్ సుశీల్ కుమార్, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి.రిపోర్టులు మరియు నివేదికల సమర్పణకు (Reports & Returns) – బి. నాగలక్ష్మి, సీఈఓ, జిల్లా పరిషత్; కె. చంద్రశేఖర్, ఉప సీఈఓ, జిల్లా పరిషత్.వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణకు (Web Casting) జె. సైదేశ్వర రావు , ఈ-డీఎం, భద్రాద్రి కొత్తగూడెం.హెచ్. వెంకటేశ్వరరావు, జిల్లఇంటర్మీడియట్విదఅధికారి నోడల్ అధికారులు అందరు ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణతో, సమయపాలనతో పనిచేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments